స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు.
విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్కూల్ యజమాని ఎండి లతీఫ్ విద్యార్థులను వెంటనే స్థానిక అశ్విని హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి ఢీ కొట్టిందని సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు తెలిపారు.




