హైదరాబాదులో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని, రాష్ట్రంలోని మేధావులు, రచయితలు, కవులతో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశంలో పరిణామాలు- మేధావుల విశ్లేషణ” అనే అంశంపై సెమినార్ 2022 అక్టోబర్ 7న ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మగ్దూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో జరుగుతుందని జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్ ను సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభిస్తారని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ , ప్రజాపక్షం దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ పాత్రికేయులు మల్లేపల్లి లక్స్మయ్య, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం , , ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు, ప్రొఫెసర్ ఖాసీం , ప్రజాకవి గద్దర్ , ప్రజా వాగ్గేయ కారులు గోరెటి వెంకన్న , ఐప్సో సమన్వయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్ , అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ వక్తలుగా తమ విశ్లేషణలను సెమినారలో తెలిపారు . సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష అభిమానులు శ్రేయోభిలాషులు, హాజరై ఈ సెమినార్ విజయవంతం చేయాల్సిందిగా అయన కోరారు.
