Breaking News

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి*

80 Views

*తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి*

 *ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్* 

సెప్టెంబర్ 6 హుస్నాబాద్.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ కార్మిక తాపీ సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ రాష్ట్రంలో కార్మిక, కర్షక ,సబ్బండవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు, వల్లపు రాజు, గుల్ల రాజు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, యూత్ నాయకులు ఇంతియాజ్, తాపీ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *