జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం రోజు ఉదయం 11.00 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందని తెలిపారు. అలాగే కుష్ఠు వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అని అన్నారు. కుష్ఠు వ్యాధి మైక్రో బాక్ట్రిరియం లెప్రే అను బ్యాక్టీరియా వలన వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి తుమ్మడం, దగ్గడం వలన వ్యాప్తి చెందుతుందని, వ్యాధి లక్షణాలు కనిపించుటకు 3 నుండి 5 సంవత్సరాల సమయం పట్టవచ్చును అని అన్నారు. శరీరం పై స్పర్శ లేని మచ్చలు, చర్మ పై రాగి రంగు మచ్చలు, కళ్లు పూర్తి గా మూసుకుపోవడం మొదలగు ఈ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. ఈలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే వైద్య సిబ్బంది దృష్టి కి తీసుకురావాలని కోరారు .
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు గారు, సూపర్వైజర్లు ఏ ఎన్ ఎం లు ఆశాలు పాల్గొన్నారు.
