జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, రమేశ్ మరియు తదితరులు పాల్గొన్నారు