ప్రాంతీయం

సోషల్ మీడియా ప్లాట్ ఫోరమ్స్ ద్వారా సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం- సిద్దిపేట సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసు,

11 Views

మ్యాట్రిమోనియల్ సైట్స్  సోషల్ మీడియా ప్లాట్ ఫోరమ్స్ ద్వారా సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం- సిద్దిపేట సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసు,

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 

సిద్దిపేట జిల్లా ప్రజలకి విజ్ఞప్తి! గుర్తు తెలియని వ్యక్తులు మ్యాట్రిమోనియల్ సైట్స్ లో, సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వాళ్ళు ఆర్ ఎన్ ఐ, ఎస్ (నాన్ రెసిడెంట్ అఫ్ ఇండియన్స్) అని, బిజినెస్ మ్యాన్ అని, విదేశాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ అని పరిచయం చేసుకొని, మ్యాట్రిమోనియల్ సైట్స్ లో  సోషల్ మీడియాలో మీయొక్క ప్రొఫైల్ చూసాము అని నమ్మించి తరచు మిమ్మల్ని సంప్రదిస్తూ, వాళ్ల యొక్క వివరాలను తెలుపుతూ మీ పైన వాళ్ల యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ మీతో వివాహ వాగ్దానం చేస్తారు. ఇట్టి విషయంలో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలుపుతూ, ముఖ్యంగా వివాహాల గురించి మాట్రిమోనియల్ సైట్స్ ని ఆశ్రయిస్తున్న అమ్మాయిలు, మహిళలు  విడాకులు తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వివాహ వాగ్దానంను నిశితంగా గమనించి, కుటుంబ వివరాలను స్వతంత్రంగా నిర్ధారించుకోవాలని తెలియజేసినారు. ఆదే విదంగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫోరమ్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన తర్వాత మీతో చాటింగ్ చేస్తూ మిమ్మల్ని నమ్మించి, ఇలా నమ్మకం పొందిన తర్వాత స్టొక్స్ ట్రేడింగ్ నందు పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు అని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాసు  ఒక్క ప్రకటన ద్వారా తెలియజేస్తూ. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు జాగ్రత్త ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు మ్యాట్రిమోనియల్ సైట్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసే అబద్దపు వాగ్దానంలు నమ్మి మోసపోవద్దని తెలియజేశారు.

 

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *