Breaking News

ముదిరాజ్ ల ముద్దు బిడ్డ మేకల కనకయ్యకు ఆత్మీయ సత్కారం*

169 Views

 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్   పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా మార్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కుంట సత్యం ముదిరాజ్ మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ నిత్యం ప్రజల బాగోగుల కోసం పని చేస్తూ ఆపద ఉన్నది అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ నిరుపేదల ఆడబిడ్డ పెళ్లికి ఒక మేనమామ లాగా పుస్తే మట్టలు అందజేస్తూ, క్లిష్ట సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మేకల కనకయ్య ముదిరాజ్ సేవలను గుర్తించి సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో సేవ రత్న అవార్డు అందజేయడం జరిగింది అని ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేకల కనకయ్య ముదిరాజ్ కు చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు ఈకార్యక్రమంలో ఎర్రవల్లి గ్రామ యూత్ అధ్యక్షుడు సిహెచ్.స్వామి, గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజ్ యూత్ అధ్యక్షులు రిప్పల స్వామి ,పోయిల.ఆంజనేయులు, సిహెచ్ శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *