Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

31 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో పని చేయాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

ప్రజల మన్ననలు పొందే లాగా జవాబుదారి తనంతో ప్రజలు, బాధితులు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం బసంత్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఏవిదంగా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ లలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండిరగ్‌ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్‌, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ పేర్కొన్నారు.

ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ , బసంత్ నగర్ ఎస్‌.ఐ స్వామి పాల్గోన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *