ప్రాంతీయం

*అధికారులను నిలదీసిన వార్డు సభ్యులు. *పైకం లేనిది ఫైల్ నడవదు.. *అధికారులపై విరుచుకుపడ్డ వార్డ్ మెంబర్ లు… *అసత్య సమాచారం అంటున్న అధికారి…

183 Views
  ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 28, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీకి గ్రామ ప్రజలు తమ తమ వ్యక్తిగత సమస్యల కొరకై వస్తే ఏపని కావాలన్నా డబ్బులు ముట్ట చెప్పవలసిందేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్డు సభ్యులు. ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కదా అంటూ ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా అంటూ వార్డు సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వార్డు సభ్యుల సమావేశం తజ్జనభర్జనగా కొనసాగింది. వార్డు సభ్యులు మాట్లాడుతూ ఇంటి అనుమతితో పాటు నల్ల కలెక్షన్ ఇతర అవసరాల కోసం ఎవరు వచ్చినా డబ్బులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారని బిల్లులు మాత్రం ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇస్తున్నారని ఆరోపించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏ వార్డుల్లో చూసిన లీకేజీ అవుతూ సిసి రోడ్లన్నీ గుంతల మయంగా మారి త్రాగునీరు డ్రైనేజ్ కి అంకితం అవుతున్నాయి ప్రజలు నెలలకు కొద్ది చెప్పుకొస్తూ ఉన్నా చోద్యం చూస్తున్న అధికారులు దీనికి సంబంధిత అధికారిని వివరణ కోరగా అది మిషన్ భగీరథ పైపులు మేం చేసేది కాదు అని జవాబు ఇచ్చారు.గత కొద్ది రోజుల క్రితం ఇంటి అనుమతి కోసం వచ్చిన ఒకరి వద్ద నుంచి నిబంధనల ప్రకారం 30 వేలు చెల్లించవలసి ఉండగా వారి వద్ద నుండి 50 వేలు వసూలు చేసి రసీదు మాత్రం 30 వేలకే ఇచ్చారని సాక్షాధారాలు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ఏపని కావాలన్నా పైకంలేనిదే పనికాదు ఫైలుజరగదు లేదా నత్త నడకన నడవాల్సిందే గృహ నిర్మాణదారులు ఆరోపించారు. ఇది నేను నిరూపిస్తాను నిరూపించకపోతే నేనే వార్డు మెంబర్ గా  రాజీనామా చేస్తానని ఆవేశంతో చెప్పుకచ్చాడు .  ఏదిఏమైనాప్పటికీని గ్రామంలో సమస్యలు ఎక్కువగా అయిపోయాయని సమస్యలు తీర్చడంలో పాటు అధికారులు కాసుల వర్షం కురిసి రైలు డబ్బాలు నిండుతనే కెదులుతోందా. మీరు గ్రామపంచాయతీలో విఫలమయ్యారంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత అధికారులు దృష్టి సారించి ప్రజలను కుబేరుల నుండి విముక్తి చేయాలని వార్డు సభ్యుడు కోరాడు. కొంతమంది వార్డు సభ్యులు గ్రామపంచాయతీలో ఏమీ జరగకున్న జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *