సిని నటులు ఇంద్రజ,అనసూయ తో పాటు చిత్ర యూనిట్
రజాకర్ సినిమా డైరక్టర్ యాట సత్యనారయణ
చిత్ర యూనిట్ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్న విమల్ దియేటర్ మేనేజర్ రవి
24/7తెలుగు న్యూస్ రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విమల్ దియేటర్ లో రజాకార్ సినిమా యూనిట్ సభ్యులు.. నటినటులు బుధవారం సందడి చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోని పోలీస్ స్టేషన్ సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి..దియేటర్ విజిట్‌కు వెళ్లి సినిమా చూడనున్నట్లు డైరక్టర్ యాట సత్యనారయణ పేర్కొన్నారు. ఇందులో నటించిన నటినటులు అనసూయ, ఇంద్రజ తో పాటు మిగతా నటినటులు హజరుకానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిజాం సర్కార్ హాయాంలో జరిగిన వాస్తవాలను, గత చరిత్రను తెలిపే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేసినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాన ప్రేక్షకులు చూసి ఆశీర్వాదించాలన్నారు. ఈ సినిమా ఏ ఒక్కరికి వ్యతిరేఖం కాదని, సినిమాను సినిమాలాగాన చూడాలన్నారు. పుస్తకాల్లో ఉన్న నిజాలు, రజాకార్ల దమనకాండపై రీసెర్చ్ చేసి తీసిన సినిమా అన్నారు. సిరిసిల్ల జిల్లా లో రజాకార్ సినిమా బృందం వస్తున్న సందర్బంగా.. ప్రేక్షకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.
