ముస్తాబాద్ జనవరి 29, ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో గొల్లకురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలోని చౌడాలమ్మ ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభోపీతంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు జెడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిసిస్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్లావెంకటస్వామి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి బోనం కళ్యాణం నాగవెల్లి పట్నాలు వేసి ఒడిబియ్యం అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ చైడాలమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ పట్ల పాడిపంటలు కుటుంబాలు సౌభాగ్యంతో పిల్లాపాపలు వాళ్లకు జీవనధారమైన గొర్రెలను యాదవులను చల్లగా చూడాలని చౌడాలమ్మను వేడుకున్నారు. బిఆర్ఎస్ నాయకులను యాదవులు సన్మానించారు. ఈకార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, బిరాస గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్, ఎలుసాని దేవయ్య, యాదవ కురుమ సంఘం అధ్యక్షులు నాగరాజు, యాదవ కురువ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
