
ముదిరాజ్ జాతీ బిడ్డలకు రాష్ట్ర బీసీ రత్న అవార్డులు రావడం మా జాతీకి గౌరవంగా ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు, చేబర్తి ఉపసర్పంచ్ స్వామిలు అన్నారు. జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, రిపోర్టర్ బలరాం ముదిరాజ్ లకు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డ్ లు రావడం జరిగింది.
ఈ సందర్భంగా ఆదివారం మర్కూక్ మండలంలోని చేబర్తి ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు స్థానిక ఉపసర్పంచ్ స్వామి ముదిరాజ్ నాయకులు మల్లెశం ముదిరాజ్ నర్సింలు ముదిరాజ్ లు బీసీ రత్న రాష్ట్ర అవార్డ్ గ్రహీతలు రాజు ముదిరాజ్ రిపోర్టర్ బలరాం ముదిరాజ్ లను శాలువాలతో సన్మానించి స్విట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ముదిరాజ్ సంఘం హక్కుల సాధనతో పాటు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు వచ్చె విధంగా కృషి చెయ్యలని కోరారు.ఈ కార్యక్రమంలో జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి కొంపెల్లి శ్రీనివాస్ ముదిరాజ్ గజ్వేల్ ముదిరాజ్ సంఘం నాయకులు కనకయ్య ముదిరాజ్ జనార్థన్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.




