అరచేతిలో ఆరు అంగుళాల అద్భుత బతుకమ్మను రూపొందించి
ఆడపడుచులకు అంకితమిచ్చిన: రామకోటి రామరాజు
1000కీ పైగా బంగారం, వెండి వర్ణం గల పూసలతో బతుకమ్మ
సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అరచేతిలో ఆరు అంగుళాల బతుకమ్మను బంగారం, వెండి వర్ణం గల పూసలను వెయ్యికి పైగా ఉపయోగించి అత్య అద్భుతంగా తయారుచేసి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తెలిగింటి ఆడపడుచులకు అంకితమిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రకృతి అందించే పండుగ, మన సాంస్కృతీ, సాంప్రదాయాలు తెలిపే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచేదే బతుకమ్మ పండుగన్నారు.
