ముస్తాబాద్ జనవరి 28, ఆలయాల అభివృద్ధితోనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లుతాయని ముదిరాజ్ సంఘస్తులు ముస్తాబాద్ మండలం బట్టోని తాళ్ళు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పెద్దమ్మ ఆలయం ముంగిట బైండ్లవారి పట్నాలతోనృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆలయ అలంకారానికి పెయింట్ దాత డాక్టర్ అరుణాచందర్, లేబర్ చార్జీలు ఎంపీపీ జనగామ శరత్ రావు దాతగా, పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు అన్నదాతగా సహకరించారని వారికి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. ఉదయం ఉదయం నుండి ముదిరాజులు నమ్ముకున్న కులదేవత పెద్దమ్మకు పోచమ్మకు బోనాలు, పెద్దమ్మ -పెద్దిరాజుల కల్యాణోత్సవం , పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం కుల పెద్దలు మాట్లాడుతూ. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పెద్దమ్మ తల్లి భావంతోనే మోక్షప్రాప్తి కలుగుతుందని అన్నారు. అనంతరం మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. మంగళ హారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆదివారం 29 రోజున బంధువులతో విందు కార్యక్రమాలు జరుగునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్ట బాబురావు, కట్ట సురేందర్, రేగుల నరసయ్య, కట్ట సుధాకర్, కట్ట దేవయ్య, తిట్ల కిషన్, పిట్ల దేవదాస్, కట్ట రవి, కట్ట సంతు, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




