ఏ ఇంట ఆపద వచ్చిన అన్నగా అండగా నిలుస్తాడు..పేదింటి ఆడ పిల్లలకు మేనమామగా చేయూతను అందిస్తాడు..
తోగుట మండల పరిధిలోని వెంకట్రావ్ పెట గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన బండారి రూప కీ”శే”రాములు గౌడ్ కుమార్తె అఖిల వివాహానికి ఎం.ఎన్.ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు పోతరాజు రవీందర్.చందా రాజు లతో పుస్తమట్టలను అందజేశారు ఈ సందర్భంగా
పేదలకు పెద్దాన్నగా
నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా పేదలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం వచ్చిన వెంటనే ఆ ఇంటికి వెళ్లి కష్టాలు తెలుసుకొని ఇంటికి పెద్ద అన్నగా అండగా నిలుస్తారు. తన సొంత ఖర్చులతో ఇప్పటికీ ఐదు మంది పేద ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అలాగే వందలాది మంది పేదింటి ఆడ బిడ్డలకు ఉచితంగా పుస్తే మట్టెలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పేదింట పెళ్లి జరిగిదంటే అక్కడ మద్దుల సాయం తప్పకుండా ఉంటుందన్నారు ఇప్పటికే చాలా గ్రామాల్లో ఎంజేబీ ట్రస్ట్ ద్వారా సేవలు చేశారు. నిరుపేదలకు అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గ్రామ ఉప్ప సర్పంచ్ గణేష్ గౌడ్.కన్నేష్.రమేష్ గౌడ్.స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు




