Breaking News

సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం

252 Views

 

మర్కుక్ మండలం చేబర్తి గ్రామ ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చేబర్తి గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట సాయిలు ముదిరాజ్ మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ నిత్యం ప్రజల బాగోగుల కోసం పని చేస్తూ ఆపద ఉన్నది అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ నిరుపేదల ఆడబిడ్డ పెళ్లికి ఒక మేనమామ లాగా పుస్తే మట్టలు అందజేస్తూ, నూతన దేవాలయాలకు తన వంతు విరాళాలు అందజేస్తూ, కరోనా క్లిష్ట సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్ సేవలను గురించి సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో టీవల హైదరాబాద్ లో సేవారత్న అవార్డు అందజేయడం జరిగింది అని ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని వారన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *