సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజ్ పల్లి గ్రామంలో ముదిరాజ్ భవననికి స్థలాన్ని పరిశీలించి, సిసి రోడ్లు నిర్మాణానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి పాఠశాల ప్రహరీ గోడ కుడా త్వరలోనే మంజూరు చేస్తామని హమి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగరాజ్ పల్లి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమనికీ ఊపిరీ పట్టులాటిదీ బోనాల బతుకమ్మలతో ఉద్యమంలో పాల్గొన్నా నాయకులు, లింగరాజ్ పల్లి గ్రామ అభివృద్ధికీ అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తాం, అలాగే త్వరలోనే మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో పలు అబివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప్ప సర్పంచ్, మాజీ సర్పంచ్, ముదిరాజ్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
