ప్రాంతీయం

కేసులు త్వరగా పరిష్కరించాలి

58 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*కేసులను త్వరితగతిన పరిష్కరించాలి*

పోలీసులు పై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతి ఒక్కరు విదులు నిర్వర్తించాలని మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.,  పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  ఆదేశాల మేరకు డీసీపీ  కార్యాలయ ఆవరణలో మంచిర్యాల జోన్ పరిధిలోని జైపూర్ సబ్ డివిజన్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. విచారణ లోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమగ్ర విచారణతో ప్రతి నిందితుడికి శిక్ష పడేలా పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. పోక్స్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. బ్లూకోల్ట్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం ప్రజల మధ్య ఉండాలన్నారు.గంజాయి సరఫరా, నిల్వ, అమ్మకం, రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచి కట్టడి చేయాలి అన్నారు. ప్రతి వారంలో ఒకసారి కోర్టు సిబ్బందితో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, జైపూర్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్