ముస్తాబాద్ డిసెంబర్ 4, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 07.12.2002, రోజున జగిత్యాల జిల్లాలో భారీ బహిరంగ కార్యక్రమానికి రానున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను జగిత్యాలకు స్వాగతించేందుకు సన్నద్ధం అయినారు. టిఆర్ఎస్ కార్యాలయంనందన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏఎంసీ చైర్మన్ జనాభాయ్, ముస్తాబాద్ మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల రమేష్ రెడ్డి, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, సర్వర్ పాష, సంతోష్ రావు, మండల కోఆప్షన్ షాదులుపాప, మట్ట రమణారెడ్డి, మెంగని మనోహర్, మల్లేష్ యాదవ్, తాళ్ల రాజు, బండి ఎల్లం, యూత్ అధ్యక్షుడు నవాజ్, తదితరులు పాల్గొన్నారు.
