ఆధ్యాత్మికం

డాక్టరేట్ అవార్డు అందుకున్న భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామి

165 Views

 

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాస పురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామికి శనివారం ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డ్ తమిళనాడు రాష్ట్రం హోసూరు పట్టణ కేంద్రం లోని ప్రముఖ స్టార్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ అవార్డ్ ప్రధానం చేయడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహిస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు మల్లే విధంగా విశేష కృషి చేస్తూ సమాజ సేవలో తన వంతు సేవ చేయడానికి గుర్తించి తమిళనాడులో డాక్టరేట్ అవార్డ్ అందుకున్న వంగపల్లి అంజయ్య స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని, దైవ నామ స్మరణ వల్ల మానసిక ఉల్లాసం తో పాటు పుణ్యం లభిస్తుందని ప్రజలని భక్తి మార్గం వైపు మొగ్గు చూపే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమా భక్తి రంగంలో చేసిన విశేష కృషి కి గాను డాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ప్రొఫెసర్లు విద్యావంతులు ప్రముఖ రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *