మిషన్ భగీరథ ఇంజనీర్లకు వర్క్ షాప్ అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ గజ్వేల్ మండలంలోని అక్కరంలో గల 40 ML క్లియర్ వాటర్ రిజర్వాయర్ మరియు క్లియర్ వాటర్ పంప్ హౌస్ పనులను, కుకునూరు పల్లి మండలం తిప్పారంలో గల మల్లన్న సాగర్ అప్ టెక్, మంగోల్ గ్రామ పరిధిలో గల గ్రావిటీ కెనాల్ క్రాసింగ్ మరియు ఒంగోలు గ్రామంలో గల 540 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న గ్రావిటీ కెనాల్ క్రాసింగ్ మరియు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణములో వేగం పెంచి మార్చి చివరిలోగా పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మిషన్ భగీరథ ఇంజనీర్లను మరియు నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆమె వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సి జి.కృపాకర్ రెడ్డి, సిఇ విజయ్ కుమార్, నిర్మాణ సంస్థ మెగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.




