ప్రాంతీయం

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ సందర్శించిన ఒరిస్సా రైతు ప్రతినిధుల బృందం…

140 Views

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కేట్ ని గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఒరిస్సా రైతుప్రతినిధుల బృందం సందర్శించడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. మార్కేట్ మొత్తం చూపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి వారికి తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికినట్లు వారు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా ఒరిస్సా రైతు ప్రతినిధి కో ఆర్డినేటర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తోనే నవ నిర్మాణ భారత దేశం సాద్యం అవుతుందని అన్నారు. వారి సారధ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే అర్థం అవుతుందని వారు తెలిపారు. నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల ప్రకారం వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు శనివారం చూడటానికి వచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దేశం మొత్తం విస్తరిస్తే దేశంలోని ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉంటారని దానికి నిదర్శనం వారు చేసిన పనులే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే దేశ స్థితిగతులు మారనున్నాయని అన్నారు. ఇంత పెద్ద మార్కెట్ తామెక్కడ చూడలేదని ప్రజలు అందరు విస్మయం చెందేలా మంచి మార్కెట్ నిర్మించి ఇచ్చారని ఇలాంటి పనులు దేశం మొత్తం జరగాలని అన్నారు. రైతుబందు, రైతుభిమా, రైతులకు ఉచిత నాణ్యమైన కరెంట్, ఇవన్నీటి గురించి స్వయంగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నమాని పంట పొలాల్లో సాగునీరు అందించిన విధానం బాగుందని అన్నారు. కోమటిబండా గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇవ్వడం మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఇలాంటివన్నీ దేశం మొత్తం జరిగితే ప్రజలు అందరు బాగుంటారని బీఆర్ఎస్ పార్టీని దేశం మొత్తం బలపర్చడం ద్వారా ఇవన్నీ సాద్యం అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వారి వెంట మార్కెట్ సెక్రటరీ జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్, ఒరిస్సా రైతు ప్రతినిధుల బృందం తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *