…. ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి మురికి కాలువలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మర్కుక్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది మర్కుక్ గ్రామానికి చెందిన బల్ల ప్రవీణ్ 24 శనివారం రాత్రి గౌరరం నుండి మర్కుక్ వెళ్తున్న సమయంలో గ్రామంలో ఉన్న పశువైద్యశాల ముందు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న మురికి కాల్వలో పడి చనిపోయాడు ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులు గమనించి గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ కు తెలియజేయడం జరిగింది దీంతో అచ్చం గారి భాస్కర్ మర్కుక్ ఎస్ఐ హరీష్ కు సమాచారం అందించారు దీంతో మర్కుక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బంధువులు రోదనలు మిన్నంటాయి సర్పంచ్ భాస్కర్ కు సమాచారం అందించినప్పటికీ పోస్టుమార్టం అంత్యక్రియలు జరిగే వరకు తనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మర్కుక్ ఎస్ఐ హరీష్ తెలిపారు మర్కుక్ లో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు
