ప్రజల పక్షం ప్రజాపక్షం దినపత్రిక…
పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి
ప్రజాపక్షం/ కోనరావుపేట: /రిపోర్టర్ కరుణాకర్/
ప్రజాపక్షం జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల పక్షంగా ప్రజా పక్షం జాతీయ దినపత్రిక పని చేస్తూ ప్రజల పాఠకుల అభిమానాలను, మన్నలను పొందుతూ ముందుకు వెళుతుందని ప్రజా సమస్యలు పరిష్కారంలో పత్రికలు ముందు ఉంటాయని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాయని సమాజంలో జరిగే అన్యాయాలకు అక్రమాలకుపత్రికలు అడ్డుకట్ట వేయచ్చు అని పత్రికలు, విలేకరులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని వారి సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల ప్రజాపక్షం రిపోర్టర్ డప్పుల కరుణాకర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి మల్యాల జాన్సన్, తదితరులు ఉన్నారు.




