దౌల్తాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డిప్యూటీ తహాసిల్దార్ జహంగీర్, మండల విద్యాధికారి నర్సవ్వ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వృద్ధులను సన్మానించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మహేష్, మమత, బిఎల్వోలు రమాదేవి, ప్రతిభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు….




