– బొప్పాపూర్ ఎల్లమ్మ గుడి నుండి ఆకారం వాటర్ ట్యాంక్ వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కి కృతజ్ఞతలు తెలిపిన బొప్పాపూర్ గ్రామ ప్రజలు
దౌల్తాబాద్: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీటీ రోడ్డును మంజూరు చేయించడం పట్ల దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు కి బొప్పాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడి నుండి ఆకారం వాటర్ ట్యాంక్ వరకు చాలా సంవత్సరాల నుండి గుంతల మాయంగా ఈ రోడ్డు మారినప్పటికీ గతంలోని ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపన పోలేదు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలిచాక పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయించుకుంటూ వస్తున్నారు.
జూన్ 28 వ తేదీనే గ్రామంలోని ఈ రోడ్డుకు ఎల్లమ్మ గుడి నుండి ఆకారం వాటర్ ట్యాంక్ వరకు తన సొంత ఖర్చులతో మట్టి రోడ్డును పూర్తి చేయించారు అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను జెసిబి డోజర్ సాయంతో చదును చేయించారు. ఈ రోడ్డును బీటీ రోడ్డు మంజూరు చేయాల్సిందిగా ఆరోజు గ్రామ ప్రజలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ని కోరగా సానుకూలంగా స్పందించి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మంజూరు చేయించారన్నారు . దశాబ్దాల కల నెరవేరినందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కి బొప్పాపూర్ గ్రామ ప్రజలు రుణపడి ఉంటామని తెలిపారు




