ముస్తాబాద్, ఆగస్టు 11 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రాములు గౌడ్ శనివారం మరణించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండల జిల్లా ఉపాధ్యక్షుడిగా అలుపెరుగని నాయకుడిగా ఎనలేని సేవలు అందించి ఆయన ఇకలేరు అని మరణవార్త కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకోని విధంగా కల్చివేసి ఉంది. వీరివెంట పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య, సీనియర్ నాయకులు ఓరగంటి, అంజన్ రావు, యాదగిరి గౌడ్, రాజేశం, ఉచ్చిడి బాలరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, సోషల్ మీడియా అనుబంధాల బండి శ్రీకాంత్‌లు ఉన్నారు.
