
ఈరోజు జగదేవపూర్ మండలంలోని స్థానిక శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో,13వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటింగ్ నమూనా ను విద్యార్థులకు తెలియజేయుటకు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వారిలో నుండి ఒక విద్యార్థిని స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినిలకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మార్వో రఘువీరా రెడ్డి గారు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కృష్ణమూర్తి గార్లు మరియు ప్రింట్ మీడియా మిత్రులు హాజరై ప్రథమంగా విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞను చేపించిన అనంతరం వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. డ్రాయింగ్ కాంపిటేషన్ లో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రథమ మరియు ద్వితీయ మరియు తృతీయ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కరస్పాండెంట్ గారు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.




