24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు.





