జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్.
మంచిర్యాల జిల్లా.
ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు
అసోసియేషన్ నమోదు వివరాల నివేదిక
మంచిర్యాల జిల్లా ఆల్ ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ఆల్ ఎల్పీజీ గ్యాస్ డోర్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్‌ను ఈ నెల డిసెంబర్ 10- 12- 2025 వ రోజున అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. అసోసియేషన్ ఉద్దేశాలు, సభ్యుల సంక్షేమం, భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్ కి వివరించారు.కలెక్టర్ అసోసియేషన్ సభ్యులు చెప్పిన మాటల కు సానుకూలంగా స్పందిస్తూ, డోర్ డెలివరీ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు- కుదురుపాక పోషం, వర్కింగ్ ప్రెసిడెంట్-అకూదారి మల్లేష్, వైస్ ప్రెసిడెంట్- బత్తుల నరేష్ , ఉప్పు చిన్నయ్య, రౌతు. మల్లేష్, ప్రధాన కార్యదర్శిలు- అనుముల మహేష్ షేక్ పెరగని శ్రీనివాస్,లీగల్ అడ్వైజర్- మొహమ్మద్ ఇమ్రాన్,కార్యవర్గ సభ్యులు-కృపానందం రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.





