చైల్డ్ హెల్ప్ లైన్-1098 రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం లోని KGBV తంగళ్ళ పల్లి పాటశాల లో *జాతీయ బాలిక దినోత్సము* ఘనంగా నిర్వహించుకోడం జరిగింది. , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి *బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ మాట్లాడుతూ* అమ్మాయిలు పట్ల వివక్ష చూపకూడదని ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశం జాతీయ బాలిక దినోత్సవం జరుపుతుంది మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ., బాలురు బాలికల మధ్య అసమాన తలను దూరం చేసేలా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జరుపుతున్నదే ఈ ప్రత్యేక దినోత్సవం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా బాలికలకు ఉండే హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ దేశంలో బాలికలను ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తుంది,. ఈ సందర్బంగా *డిసీపివో స్వర్ణలత* గారు మాట్లాడుతూ “జాతీయ బాలిక దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాలికలను అభివృద్ధి దిశగా నడిపించి ఉత్తమ సమాజాన్ని నిర్మించడం”. “బాలికలు చిన్నవాళ్లే కానీ వాళ్ల కలలు ఆకాశాన్ని తాకుతాయి వారి విజయాలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి” ఒక స్త్రీ తమ జీవితంలో కుమార్తెగా ,సోదరి, భార్య, తల్లి పాత్రలు పోషిస్తుందని మగ పిల్లలతో సమానం అయిన అవకాశాలు ఉండేలా చూడాలని తెలిపారు .ప్రతి సంవత్సరం జనవరి 24 న జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు .బాలికపై జరుగుతున్న అత్యాచారాలు అనర్థాలను నివారించి వారి యొక్క హక్కులను తెలియజేసేందుకు దినోత్సవాన్ని ప్రకటించారు అని అన్నారు. *చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి మాట్లాడుతూ* ప్రాచీన కాలంలో మహిళలకు ఎంతో గౌరవం వచ్చేవారు అని అన్నారు.కానీ కాలంతో పాటు పరిస్థితి మారిందని ప్రజల్లో ఆలోచనలో మార్పు వచ్చిందని ఆడపిల్లలను వంటింటికి పరిమితం చేశారని మళ్ళీ ఆధునిక కాలంలో ఆడపిల్లల పరిస్థితి క్రమంగా మారుతుందని అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారని అన్నారు .కానీ ఇప్పటికి కూడా బాలిక వివక్షతను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాల్యవాలు, వరకట్నం వేధింపులు ,అత్యాచారాలు చదువులో అవకాశాల కల్పన అసమానత్వం అనేవి అడుగున కనిపిస్తున్నాయని తెలిపారు .బాలికల హక్కుల ఉల్లంఘన వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియపరచడం కొరకు 2012 నుండి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం,జనవరి 24 జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. యొక్క హక్కుల పట్ల పవన కల్పించడానికి లింగ వివక్షత ఆపడానికి మహిళా మహిళా సాధికారత కోసం పోరాటం అనేది బాలికల దినోత్సవం లక్ష్యాలు అన్నారు. సమాజం లో బాలికల ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా అమ్మాయిల శాతం అబ్బాయిల శాతంకా అంటే తక్కువ ఉందని తెలిపారు బాలికల మీద వివక్షత ఇంకా ఉన్నదని తెలిపారు దేశంలో అమ్మాయిల శాతం ఎందుకు తగ్గుతుందని పిల్లలపై జరుగుతున్న అక్రమాలు అత్యాచారాలు వాటి నరికట్టడానికి వారి యొక్క హక్కులను తెలుసుకోవాలని *తెలిపారు. 1995 బీజింగ్ లో నిర్వహించిన భేటీలో మహిళలు బాలికల హక్కుల పరరక్షణ కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవం చేశారని, బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తీర్మానం ఇదే అని తెలిపారు. నేటి ఆధునిక మరియు విద్యాయోగంలో కూడా ద్రోణ హత్యలు జరుగుతున్నాయని ఇది మన దేశానికి ప్రపంచానికి బాధ కలిగించే విషయం ఆడపిల్లల బృణ హత్యల వల్ల మన సమాజంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతుంది అన్ని రంగాల్లో అమ్మాయిలతో అబ్బాయిలు సమానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని బాలికల యొక్క హక్కులను కూడా వారు తెలుసుకొని అన్ని రంగాల్లో విజయం సాధించాలని తెలిపారు.బాలికలు అదైనా సమస్య వస్టే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేయాలని తెలిపారు.24*7 బాలల బాలికల రక్షణ మరియు సంరక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు . ఈ కార్యక్రమం లో CI ఉపేందర్ గారు మాట్లాడుతూ బాలిక పుట్టితే మహా లక్ష్మి పుట్టిందని భావించాలని ,బాలికలు అన్నీ రంగాలలో రాణించాలని అన్నారు.బాలికల పట్ల వివక్షత ఉండరాదని అన్నారు.బాలిక రక్షణ కోసం పోలీస్ వారు SHEE team ను ,భరోసా సెంటర్ ను ఏర్పాటు చేశారు అన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్యామల ఉపాధ్యాయులు,చైల్డ్ లైన్ సిబ్బంది శ్రావణ్ నాగరాజు ,సునీత ,మౌనిక పిల్లలు పాల్గొన్నారు.
