రాజకీయం

మీరే నిర్ణయకర్తలు.! తొందరపాటు ఆలోచనలు వద్దు. నార్మల్ డెలివరీలే తల్లీబిడ్డలకు శ్రేయస్కరం. పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు.

187 Views

రేపటి ఆరోగ్య సమాజానికి మీరే నిర్ణయకర్తలు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు, రేపటి తరాలకు ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 20 మంది వికలాంగులకు ట్రై సైకిల్ వాహనాలు, 47 మందికి రూ.17 లక్షల 16 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 134 మంది లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల రూపాయల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు మూఢ నమ్మకాలు, ఆచారాలను, మంచి రోజు అనే సాకుతో గర్భిణీలకు శస్త్ర చికిత్స చేయించడం తగదని, నార్మల్ డెలివరీలు తల్లీ, బిడ్డలకు ఎంతో శ్రేయస్కరమని చెప్పుకొచ్చారు. వైద్యుల మీద ఒత్తిడి చేసి ఆపరేషన్ చేయాలని పట్టు బట్టడం వల్ల భవిష్యత్తులో తల్లీ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నార్మల్ డెలివరీ మంచిదని, ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించాలని సూచించారు. పేద ప్రజల డబ్బులు వృథా కావొద్దన్నదే నా తపన అని అందుకే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళొద్దని డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. మొదటి గంటలో తల్లీ పాలు ముఖ్యమని రోగనిరోధక శక్తిని బిడ్డలకు అందించాలని సూచించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించి పిల్లలకు ప్రయోజనం కలిగేలా మొదటి గంట తల్లిపాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మ ఇచ్చేలా వైద్యశాఖ వినూత్న మార్గం ఎంచుకుందని, గర్భిణీ స్త్రీలకు యోగ, ధ్యానం అందించే సేవలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కన్న బిడ్డ మీద ప్రేమతో వారికి శ్రమ లేకుండా చేస్తున్నామని, ఇది తప్పని ప్రతి గర్భిణి మహిళ తప్పనిసరి సులువైన వ్యాయమం చేయాలని సూచించారు. రక్త హీనత సమస్యలు అధిగమించాలంటే ధ్యానం కూడా చేయాలన్నారు.

*ఏప్రిల్ లో ప్రత్యేక కిట్స్:*

ఉచితంగా భోజనం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఏప్రిల్ లో న్యూట్రీషన్ కిట్ కూడా అందిస్తామని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బలవంతమైన, పౌష్టికాహారం కల్గిన న్యూట్రిషన్ కిట్ ఎంతో మంచిదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయం అందించిన నియోజకవర్గం సిద్దిపేటగా 6463 మంది లబ్ధిదారులకు సుమారు 26 కోట్ల 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. లబ్ధిదారులు చెక్కులను సకాలంలో బ్యాంకు ఖాతాలో వేసుకోవాలని సూచించారు. ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మీ పేరిట ఆర్థిక సాయం చేస్తున్నట్లు, సిద్ధిపేట నియోజకవర్గంలో 10 వేల 201 మందికి అందించగా, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి అందజేసినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *