ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బి సి మేలు కోలుపు రథ యాత్ర

27 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రం లో బి సి మేలు కోలుపు రథ యాత్ర.

మా వాటా మాకు దక్కల్సిందే.- బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలు కోలుపు రథ యాత్ర      ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రానికి
చేరుకున్నది, జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రలో బీసీ నేతలు పాల్గొని జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో వాటాను అందించాలని మేమెంతో మాకంత వాటా నినదించారు.

జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరియైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా పేదవారుగా ఉన్నారని నిజానికి ఈ దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజారిటీ ప్రజలు బీసీలనీ, ఈ స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కనపెట్టి కార్పొరేటీకరణకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని తద్వారా బీసీల అభివృద్ధి సాధించి ప్రతి పౌరుడు అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, గతంలో బీసీల ప్రాథమిక హక్కుయైన కుల గణన సాధన కోసం 78 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు వంచించడం తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, బీసీల అభివృద్ధి కోసం మండల కమిషన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కారని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక బీసీలకు స్వాతంత్రం పోయిందని కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ సామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటాను సాధించినప్పుడే నిజమైన విముక్తిని సాధిస్తామని బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, బీసీ ఉద్యమాన్ని ప్రతి పల్లెలో బలోపేతం చేసి ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం పాటు బీసీ మేల్కొల్పు రథయాత్రను తెలంగాణ జాతిపిత, తెలంగాణ సామాజిక ఉద్యమాల పితామహుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో వారి స్వగ్రామంలో ప్రారంభించడం జరిగిందని ఈ యాత్ర అలంపూర్ లో ముగుస్తుందని తెలిపారు.

ఈ యాత్రకు స్థానిక తదితరులు స్వాగతం పలుకగా వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జక్కని సంజయ్ కుమార్, బీసీల పోరాటాన్ని ప్రతి పల్లెకు చేర్చేందుకు పోరాడుతున్నారని వారి పోరాటం ఫలించాలని ఆకాంక్షించారు, ప్రతి పల్లెలో బీసీలు ఐక్యంగా ఉండాలని తద్వారా బీసీల హక్కులను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జక్కని సంజయ్ కు ఘనంగా శాలువాతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, జాతీయ గీసి సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ నీలకండేశ్వర్ గౌడ్, డాక్టర్ రాజకిరణ్, గుమ్ముల శ్రీనివాస్, వైద్య భాస్కర్, నేన్నెల నరసయ్య, బియ్యాల సత్తయ్య, బీసీ జేఏసీ జిల్లా నాయకులు వేముల మల్లేష్, గుండు రాజన్న, గరిగ చేరాలు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు చేరాల వంశీ,తాళ్ల హరీష్ గౌడ్ బీసీ యువజన నాయకులు పెద్దల్ల చంద్రకాంత్, ఎండి లతీఫ్, భీమ్సేన్ బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు సుంకటి పోషేత్తి మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్