బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి
15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు
మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు!
ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య అనే (45) వ్యక్తి సొంత ఊరికి వస్తాను అనుకున్న రోజే గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మృతుడి స్వగ్రామం కథలపూర్ మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే మృతుడు గత 15 సంవత్సరాల క్రితం అప్పులు చేసి గల్ఫ్ దేశానికి వెళ్లి కంపెనీలో సరైన వేతనాలు లేక కళ్లివెళ్లై పనులు చేసుకుంటూ ఎంతో కొంత కుటుంబానికి డబ్బులు పంపుతూ ఆసరాగా నిలిచాడు. కంపెనీ వీసా కాకపోవడంతో సరైన పని దొరకక చేతిలో చిల్లి గవ్వలేక గత కొన్ని సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాడు. సౌదీలో పడుతున్న కష్టాలను తన భార్య బుజ్జి కి చెప్పి ఎలాగైనా తాను ఇండియాకు రావడానికి వీసాకు డబ్బులు పంపాలని చెప్పడంతో అప్పులు చేసి బుజ్జి గత కొద్ది రోజుల క్రితమే డబ్బులు పంపింది. స్వగ్రామానికి వచ్చిన తర్వాత కూలినాలి చేసి బ్రతుకుదాం అనుకున్న కుటుంబానికి నరసయ్య గుండెపోటుతో చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎలాగైనా కడసారి చూపు చూసేందుకు తన భర్త మృతదేహాన్నీ స్వగ్రామానికి రప్పించే విధంగా ప్రభుత్వం సహకారం అందించాలని భార్య బుజ్జి కొడుకు జాను కన్నీటితో వేడుకుంటున్నారు..




