ముస్తాబాద్ జనవరి 24, బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనరేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను గాలికి వదిలేసి దాదాపు 8 సంవత్సరాల నుండి ఇప్పటివరకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా పుట్టిన పిల్లలకు రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా అదేవిధంగా నూతనంగా వివాహాలు చేసుకున్న కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు పేరు నమోదు ఎలాంటి ఆప్షన్ పెట్టుటలేదు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు వెంటనే మంజూరు చేయాలని లేని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటానికి ముందుంటానని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాద నరేష్ డిమాండ్ చేశారు.
