తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం — బి జె పి.
మంచిర్యాల జిల్లా.
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవి దేవతలపై చేసిన అనుచిత వాక్యలకు నిరసనగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమీరి శెట్టి రాజుకుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలపై హిందూ సమాజంపై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి మీరు ఎన్నికల ప్రచారంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి అనేక హామీలు ఇస్తామని చెప్పడం మర్చిపోయారా అని అన్నారు. హిందూ సమాజం అన్నా హిందూ దేవులన్న ముఖ్యమంత్రి కి చిన్న చూపు అయ్యిందన్నారు. ముస్లిం వర్గాలను గాని క్రిస్టియన్ వర్గాలను గాని ఈ విధంగా హిందూ సమాజం మీద మాట్లాడినట్టు అవహేళన గా మాట్లాడగలరా అంత ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. మీ వ్యాఖ్యలను మరియు పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకముందు మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో ఏ గుళ్లో మిమ్మల్ని అడుగుపెట్టనీయమని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నస్పూర్ జోన్ అధ్యక్షులు కుర్రె చక్రవర్తి నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శి మద్ది సుమన్ యాదవ్, రెడ్డిమల్ల అశోక్, పచ్చ వెంకటేశ్వర్,ముద్దం మల్లేష్,సిపాతి శ్రీను,రాజా బాపు,గాదె శ్రీనివాస్,ఎలికపెళ్ళి పవన్ కుమార్,
పందిళ్ళ రాజేష్,షనకొండ మణికంఠ,కంట్ల రాజా శేఖర్,మీనా సూరి,నేరేళ భరత్,సాయి,కొత్తపల్లి సుజిత్,దుగుట కిరణ్,జాడి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.





