
ముస్తాబాద్ జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన చందుపట్ల అంజిరెడ్డి కృతజ్ఞత సభను స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ కార్యకర్తలు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు నూతన పాలకవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ చిన్న అసౌకర్యం లేకుండా అందుబాటులో ఉంటానని నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ఎవరికి ఎలాంటి అంతరాయం సమస్యలు లేకుండా కృషి చూస్తానని అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగాయ్య, రాష్ట్ర పవర్ లుమ్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీటీసీ నర్సయ్య, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, జెడ్పిటిసి గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచులపొరం అధ్యక్షులు కిషన్ రావు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జనాభాయ్, ఈవిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




