ప్రాంతీయం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి 

140 Views

 

 

అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత శనివారం రోజు గజ్వేల్ పట్టణంలో 10 వ వార్డు కు చెందిన పోయిల మంజుల గారి పేరు గతంలో రెండు సార్లు అర్హుల జాబితా ఉన్నపటికీ పేరు తొలగించారని మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.ఇటువంటివి జరగకుండా నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తరుపున కోరుతు మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఇందులో జజిల్లా ఉపాధ్యక్షులు కటికెల ఓం ప్రకాష్ , నియోజకవర్గ ఇంచార్జి కొనడనొల్ల నరేష్ , నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ , ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం , ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ కోశాధికారి జోడి ముంతలు నవీన్, కర్రోళ్ల నవీన్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *