ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపురం గ్రామ శివారులో గల రేకుల షెడ్డులో వద్ద పేకాట స్థావరం పై సీసీఎస్ ఎస్.ఐ మారుతీ ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ పొలీస్ లు మెరుపు దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 1,55,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నమని వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ వి శేఖర్ తెలిపారు పేకాటఆడుతూ పట్టుబడిన వారిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం . ఈ దాడుల్లో టాస్క్ పోర్స్ ఎస్.ఐ మారుతి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
