రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్ పోలింగ్ (నమూనా ఎలక్షన్)ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్‌ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సత్తయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో విషయాన్ని కన్నులకు కట్టినట్లుగా విద్యార్థులకు చూపించారు. ఓటు హక్కు పై అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు విలువను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Super