Ts24/7 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా లోని ఉగ్ర వాయి వద్ద కారు టాటా ఎస్ ఏ ప్యాసింజర్ ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఎల్లారెడ్డి పేట మండల వాసులు తీవ్రంగా గాయపడ్డారు.కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పేటకు వస్తున్న ప్యాసింజర్ ఆటో టి ఎస్ 16 యు బి 5548 నెంబర్ కల వాహనంలో ప్రయాణిస్తున్న ఆటో మాచా రెడ్డి నుండి కామారెడ్డి వెళుతున్న టి ఎస్ 17 కే 6968 నెంబర్ కలిగిన కార్ ఎదురు ఎదురుగా డి కొన్నాయి.ఈ ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ భి కాలు చేయి విరిగి తీవ్రంగా గాయ పడగా బైరి లావణ్య కు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిసింది.అదే ఆటోలో వున్న గ్రామానికి చెందిన బి అర్ ఎస్ మాజీ గ్రామ శాఖ అద్యక్షుడు డాక్టర్ ఆంజనేయులు బార్య రమాదేవి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయట పడ్డట్లు తెలిసింది ఈ ప్రమాదంలో మరో వృద్దుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.ఆయన వివరాలు తెలియాల్సి వుంది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కామారెడ్డి కి చెందిన శ్రీకాంత్ అనే కార్ డేకర్ వర్క్ చేసే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ కామారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.





