ఎల్లారెడ్డిపేట జనవరి 23 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ బాబు, మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో కంటి వెలుగు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సోమవారం కంటి వెలుగు వైద్య శిబిరంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి. పోలీస్ సిబ్బంది కంటి పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి స్రవంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు వైద్య శిబిరాలను ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ సద్వినియోగపరచుకుని కంటి పరీక్షలు చేపించుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కంటి పరీక్షలు చేపించుకున్న ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి మాట్లాడుతూ కంటి వైద్య శిబిరమును మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు 120 నుండి 150 మంది వరకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ప్రవీణ కుమారి. భూ లక్ష్మి. అమృతవల్లి. పద్మ. శ్యామల. శారద.ఆశాలు. స్రవంతి.సరితా. రజిత. లత. స్వప్న. వసంత. పలువురు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






