రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబందు స్కీమ్ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళిత బందు స్కీమ్ ను ప్రవేశ పెట్టి అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది దళిత బందు స్కీమ్ అమలు చేయడం లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీవ్ర అన్యాయంజరిగిందిప్రతి నియోజకవర్గంలో 70నుంచి 80వరకు మాదిగ సామాజిక వర్గానికి అమలు చేశారు మాలలకు అన్యాయం చేస్తూ అవమాన పరుస్తున్నారు రాజకీయ కోణంలో కాకుండా రాజకీయాల కాకతీతంగా ప్రతి దళిత కుటుంబాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ప్రజా ప్రతి నిధులు రాజకీయ కుల వివక్షతతో మాలలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు దళిత బందు స్కీమ్ సమానంగా అమలు చేయకపోతే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లును ముట్టడిస్తాము అని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం గతంలో అమలు చేసిన మూడు ఎకరాలభూమి ఎస్సి కార్పొరేషన్ చేర్మెన్ పిడమర్తి రవి , రెవిన్యూ అధికారులపై ఒత్తిడి చేసి ఓకే వర్గానికి మూడు ఎకరాల భూమిని అమలు చేసి పేదలైన మాలలకు అన్యాయం చేస్తూ వస్తున్నారు మాల సోదరులారా మేధావులారా మనమంతా చైతన్యవంతమై ప్రభుత్వం అమలు చేస్తున్న పతకాలను ప్రతి మాల దళిత కుటుంబానికి అందే విదంగా ఐక్య పోరాటం ద్వారా సాధించు కోవాలని తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడుఈ కార్యక్రమం లో దోసల చంద్రం , ప్రేమ్ కుమార్ , లక్కం బాబు పిట్ల రఘు , దేవరాజ్ పెండల నరసింహులు , ఎగదండీ రాజేందర్ , తదితరులు పాల్గొన్నారు
