వాసవి కన్యకా పరమేశ్వరి’ లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం వాసవీ మాత మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గొమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించుట వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులకు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.ఈకథను గూర్చి కన్యకా పురాణములో మిక్కిలిగా ప్రస్తావించబడింది.దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు.ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యుల కుల ధర్మముల కట్టడి యొనర్చుట కుద్దేశించబడిన గ్రంథముగా కనబడుచున్నది.ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది.భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి పదునెనిమిది పట్టణములలో ఆవర్భవించిరి.పెనుగొండ వారిముఖ్య పట్టణము.మిగిలిన పదుహేడు పట్టణములు వరుసగా, ధర్మ, ధనద, పాంచాల, నిరవద్య, జననాధ, క్షీరకాసార, దెందులూర, ఏలూర, ఘంటశాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నృశింహ, వీరనారాయణ,అచంట, సగరము. ఈ పురాణములో, కొన్ని శాసనముల ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరుకూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్రశాసనములు చాళుక్యా కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురుంచి తెలుపుట వలన, ఈ కథకు సంబంధిన కాలము సా.శ.10-11వ శతాబ్దము అయివుండవచ్చును.





