గంభీరావుపేట మండలం :సెప్టెంబర్ 11
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ని సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణం లో ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మండపల నిర్వహకులు తోటి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం లో గణపతి ఉత్సవాలు ప్రశాంతవాతావరణం లో జరుపుకోవాలని అల్లర్లకు పాల్పడరాదని సూచించారు ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డిపేట మండలం సిఐ శశిధర్ రెడ్డి, గంభీరావుపేట ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
