
తొగుట; మండలంలోని గోవర్ధన గిరి పరిధిలోని చిన్న ముత్యంపేట లో దుర్గమ్మ పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామస్తులు ఈరోజు సాయంత్రం దుర్గమ్మ పండుగ నిర్వహించుకుంటుండగా..వంటలు చేస్తుండగా..వేప చెట్టు మీద ఉన్న తేనె టీగలు ఒక్కసారిగా వారిమీద దాడి చేశాయి..దీంతో తలొదిక్కు పరుగులు తీశారు..గ్రామానికి చెందిన రుక్కమ్మ, జగన్నాథం కు తీవ్రంగా కుట్టడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించారు..సర్పంచ్ తోయేటి ఎల్లం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపీ గారు ఆసుపత్రి వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు..




