గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ నందు కళాశాల, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు మెంటల్ హెల్త్ కార్యక్రమం లయన్ శ్రీ డాక్టర్ మామిడాల శ్రీనివాస్ సైకాలజిస్ట్ తో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు విద్య పరంగా మానసికపరంగా సామాజికపరంగా నైతికపరంగా ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలను వివరించడం జరిగింది. సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గజ్వేల్ సామల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో కళాశాల, పదవ తరగతి విద్యార్థినులు వసతి గృహ సంక్షేమ అధికారులు జ్యోతి, గీతాంజలి, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





