Breaking News

గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ డిగ్రీ విద్యార్థులారా న్యాక్ ( ఎన్ ఎ ఎ సి )గుర్తింపు లో భాగస్వాములు అవండి

162 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో 2020-2021 విద్యా సంవత్సరం నుంచి 2022-2023 విద్యా సంవత్సరం వరకు మధ్యకాలంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో బిఎ,బీకాం,బీఎస్సీ కోర్సులు చదివిన ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపులో భాగంగా బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి మెయిల్స్ వస్తాయని,అట్టి మెయిల్స్ ని ఓపెన్ చేయాగానే గూగుల్ ఫామ్ వస్తుందని,ఆ ఫామ్ లో ఉన్న ప్రశ్నావళిని నింపి సబ్మిట్ చేయాలని, గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిట్ల దాసు మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ బి. శ్రీవల్లి పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ పిట్ల దాసు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్ ) ప్రధాన కార్యాలయమైన బెంగళూరు నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాల్లో చదివిన విద్యార్థులకు గూగుల్ ఫామ్,మెయిల్ ద్వారా నిర్వాహకులకు పంపుతారని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రశ్నావళిని విధిగా నింపి పంపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మొదటి దశలో వచ్చిన మెయిల్స్ ని పరిశీలించి విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరారు.విద్యార్థులందరూ విధిగా సర్వేలో పాల్గొనాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి న్యాక్ గుర్తింపులో భాగము కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ క్లర్క్ కృష్ణ ప్రసాద్ కౌన్సిలర్లు విజయ్, శ్రీనివాస్,ఆదివిష్ణు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *