– గ్రామీణ యువత క్రీడలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ కప్పు రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్న దౌలాపూర్ క్రికెట్ క్రీడాకారులకు ఆదివారం దౌలాపూర్ గ్రామానికి చెందిన గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి క్రీడ దుస్తులు,క్రికెట్ కిట్టు కోసం 10,000 వేల రూపాయల నగదు క్రీడాకారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా ప్రతిభ కనబరచుకోవడం తోపాటు ఆరోగ్యం స్నేహం పెంపొందించుకోవచ్చని సూచించారు. గ్రామీణ క్రీడాకారులు ఇలాంటి టోర్నీలో పాల్గొని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. తమవంతుగా క్రీడాకారులకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌలాపూర్ క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.