Breaking News

అన్నదానం మహా దానం – ఎమ్మెల్సీ యాదవరెడ్డి

138 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెళ్ళి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని మహా పుణ్యం లభిస్తుందని ఈరోజు అన్నదానం నిర్వహించిన కొమరవెళ్ళి సుధాకర్ మాధవి దంపతులను అభినందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,సిద్ది బిక్షపతి,భద్రయ్య, కొమరవెళ్ళి సుధాకర్,సుధీర్,ప్రవీణ్, అయిత సత్యనారాయణ, రుక్మయ్య, శ్రీహరి, దొంతుల సత్యనారాయణ,కైలాస ప్రశాంత్,ఉమేష్, లచ్చలు, వెంకటేశ్,శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *